ఏజెంట్ షూటింగ్ కి ఆదిలోనే ఆటంకం..!?
అయితే ఐదు రోజుల క్రితం అంటే జూలై 12న అఖిల్- సురేందర్ రెడ్డి ల 'ఏజెంట్' మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ఏపిలోని నెల్లూరు జిల్లాకి చెందిన కృష్ణపట్నంలో షూటింగ్ ను ప్లాన్ చేశారంట. కాగా.. మొదటి రోజు బాగానే ఉన్నా… రెండో రోజు నుండీ చిత్ర యూనిట్ సభ్యులని వరుణుడు డిస్టర్బ్ చేశారు. అయితే అప్పటి నుండీ వర్షాలు ఎడతెగకుండా పడుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడది తుఫాన్ గా మారడంతో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ ను క్యాన్సిల్ చేశారంట.
ఇక టీం మొత్తం తిరిగి హైదరాబాద్ కు రావడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొన్నటికి మొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ సెట్ కూడా ఎడతెగకుండా కురిసిన వర్షాలకు పాడైపోయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీని వల్ల రూ.3 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు చిత్ర బృందం తెలిపింది.
ప్రస్తుతం అఖిల్ మూవీకి కూడా అదే విధంగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏ చిత్రాన్ని 'ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక . ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో అఖిల్ 6 ప్యాక్ లుక్ లో అదరగొట్టాడనే చెప్పాలి మరి. ఈ చిత్రం రూ.65 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్నట్టు సమాచారం.