రెండు సినిమా లు రెడీ.. ఎటు తేల్చుకోలేక పోతున్న నాని!!

P.Nishanth Kumar
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రితూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా మా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు కళ్యాణి నటిస్తుండగా నాని కెరీర్లోనే ఈ సినిమా విభిన్నమైన చిత్రం గా తెరకెక్కింది అని అంటున్నారు.

ఇకపోతే టక్ జగదీష్ సినిమా విడుదల ఆలస్యం కావడంతో నాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాను కూడా పూర్తి చేశాడు.  లాక్ డౌన్ కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నాని తరువాత సినిమా అయిన శ్యామ్ సింగ రాయ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ముందుగా ఏ సినిమా రిలీజ్ చేయాలి అనే డైలమా లో ఉన్నాడట నాని. టాక్సీ వాలా చిత్రం తో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఆ సినిమా తరహాలోనే ఈ ఈ వచ్చిన ఈ సినిమా కూడా అంతే వెరైటీగా ఉండబోతుంది అని అంటున్నారు. 

ఇవే కాకుండా ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ సినిమానీ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలను విడుదల చేసి ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడట నాని.  గతంలో వి సినిమా సమయంలో నాని ఇదే పరిస్థితి నెలకొని చివరికి ఓ టి టి లో సినిమాను విడుదల చేసి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. మరి ఇప్పుడు నాని ఏ విధంగా తన సినిమాలను హిట్ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం నాని ఫ్యాన్స్ కూడా హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: