ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ పలువురు పెద్ద దర్శక, నిర్మాతల కళ్ళల్లో పడి పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తొలి సినిమా అవకాశం తర్వాత రష్మిక మందన రెండవ అవకాశం అందుకోవడానికి పెద్దగా కష్టపడలేదు . గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయి తన దశ మార్చుకుంది.
రష్మిక మందన విజయ్ దేవరకొండ జంట గా నటించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మీక. ఈ సినిమా తర్వాత ఆమెకు వరస పెద్దపెద్ద అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఈ సినిమాలో ఆమె చేసిన గీత పాత్రకు మరెవరు సరితూగరు అనే రేంజ్ లో నటించి సినిమా హిట్ కావడానికి ఎంతో కారణం అయ్యింది 2018 లో ఆగస్టు లో విడుదలైన ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి మొదటి అడుగు వేసినట్లు అయ్యింది.
ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో ఆమె వరుసగా మంచి మంచి సినిమాలు చేయడం మొదలు పెట్టింది. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, వంటి హిట్ సినిమాల్లో నటించి తిరుగు లేని హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అక్కడ కూడా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. అలాగే ఇటీవలే బాలీవుడ్ కి కూడా వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న రష్మిక త్వరలో తమిళంలో ఆ తర్వాత బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతో కృషి చేస్తోంది.