విజయ్ సేతుపతి కన్నీటి కష్టాలు మీకు తెలుసా..!?
విజయ్ సేతుపతి ఒక వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. తమిళంలో ఓ టీవీ షోలో చెఫ్ ప్రోగ్రామ్ తో బుల్లితెరపై కూడా అలరించబోతున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ లో విజయ్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తనకు వంటలంంటే చాలా ఇష్టమని తను ఈ స్థాయికి రావటానికంటే ముందు ఎన్నో కష్టలు పడినట్లు విజయ్ సేతుపతి తెలిపారు.
కాలేజ్ డేస్ ఓ పక్క చదువుకుంటూనే డబ్బుకోసం పార్ట్ టైం జాబ్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12.30 గంటల వరకూ ఫాస్ట్ పుడ్ సెంటర్లో పనిచేశానని విజయ్ సేతపతి తెలిపారు. అక్కడే రాత్రి భోజనం చేసేవాడనిని ఆయన తెలిపారు. అందుకుగానూ నెలకు 750/- ఇచ్చేవారని తెలిపారు. చాలా ఆశ్యర్యంగా ఉందికదూ..! హోటల్లోనే కాకుండా..కొన్ని రోజులపాటు టెలిఫోన్ బూత్ లో కూడా పనిచేసినట్లు తెలిపారు.