శ్రీకాంత్ సూపర్ హిట్ మూవీ.. ఆ నలుగురు స్టార్స్ చేయనన్నారా..?

shami
కొన్ని సినిమాలు కథల రూపంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలను అంచనా వేయడం కష్టం అందుకే కొందరు హీరోలు కొన్ని హిట్ సినిమా కథలను కూడా మిస్ అవుతుంటారు. అయితే అలాంటి సినిమాల్లో ఒకటి శ్రీకాంత్ పిల్ల నచ్చింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముందు శ్రీకాంత్ తో అనుకోలేదట డైరక్టర్ ఈవీవీ. ముందు సినిమాను నలుగు టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలకు వినిపించారట.
వారు ఎవరు ఈ కథ మీద ఆసక్తి చూపించలేదట ఇక చేసేది ఏమి లేక శ్రీకాంత్ తో తీశారట. అప్పటికే ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాలు చేసిన ఈవీవీ సత్యనారాయణ చేసిన పిల్ల నచ్చింది సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా తన మార్క్ కామెడీ జోనర్ లోనే నడిపించారు ఈవీవీ. సినిమా ఫలితం మీద నమ్మకం లేని ఆ నలుగురు స్టార్స్ సినిమా రిజల్ట్ చూసి మంచి సినిమా మిస్ అయ్యామని ఫీల్ అయ్యారట.
శ్రీకాంత్ హీరోగా నటించిన పిల్ల నచ్చింది సినిమాను ఉషారాణి నిర్మించారు. రచన, సంఘవి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు కోటి మ్యూజిక్ అందించారు. 1999లో రిలీజైన ఈ సినిమా శ్రీకాంత్ కెరియర్ లో హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్ నలుగు సూపర్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో సినిమాలు తీసిన ఈవీవీ పిల్ల నచ్చింది కథతో మాత్రం వాళ్లని మెప్పించలేదు. అయినా సరే శ్రీకాంత్ తో తీసి ఆ సినిమా హిట్ అందుకున్నారు. ఈవీవీ సినిమాల్లో కథతో పాటుగా కామెడీ కూడా ఉంటుంది. అందుకే ఆయన చేసిన సినిమాల్లో విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈవీవీ చివరి సినిమా బురిడి. 2011 జనవరి 21న ఆయన మరణించారు. ఆయన దూరమైనా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకులను ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకునేలా చేస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: