రవితేజతో అనుకుని.. పవన్ కి చెప్పి మహేష్ తో తీశాడు..!

shami
పూరీ జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా అది. సినిమాలో మహేష్ స్టైల్, డైలాగ్ డెలివెరీ మొత్తం అభిమానులకు బాగా ఎక్కేశాయి. పోకిరి తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా కథ పూరీ బద్రి సినిమా కన్నా ముందే అనుకున్నారట. అప్పటినుండి దీన్ని హోల్డ్ లో పెట్టుకున్నారట.
ముందు ఈ సినిమాను మాస్ మహరాజ్ రవితేజతో తీయాలని అనుకున్నారట. టైటిల్ కూడా ఉత్తం సింగ్ అని పెట్టుకున్నారట. రవితేజ ఎందుకో ఈ సినిమా కాదనడంతో పవన్ కళ్యాణ్ కు కథ వినిపించాడట పూరీ జగన్నాథ్, పవర్ స్టార్ కూడా కథ విని బాగుంది అన్నారట కాని చేద్దాం అని అనలేదట. ఇక అప్పుడు కంప్లీట్ క్లాస్ ఇమేజ్ ఉన్న మహేష్ కు ఈ కథ సూట్ అవుతుందని భావించి వెళ్లి చెప్పాడట. మహేష్ కు కథ నచ్చి వెంటనే ఓకే చెప్పడం సినిమా తీసేయడం జరిగింది.
సినిమా షూటింగ్ టైం లో కూడా సినిమా గురించి పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ చేశారు. చిత్రయూనిట్ లోనే ఈ సినిమా ఆడే సినిమా కాదన్న భావన వచ్చిందట. కాని రిలీజ్ తర్వాత రికార్డులు సృష్టించింది మహేష్ పోకిరి సినిమా. ఈ సినిమా సూపర్ స్టార్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఏ సినిమా ఎవరికి పడాలో వారికే పడుతుంది అన్నట్టుగా రవితేజ కాదని.. పవన్ లైట్ తీసుకున్న పోకిరి మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఎన్నేళ్లయినా మహేష్ పోకిరి రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంది. పూరీ కెరియర్ లో కూడా పోకిరి వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సృష్టించింది. పూరీ మహేష్ కాంబినేషన్ లో పోకిరి తర్వాత బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా మంచి వసూళ్లని రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: