నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న యువ హీరో... ?
అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. కాగా అనతి కాలంలోనే గొప్ప గుర్తింపును దక్కించుకున్న హీరో నిఖిల్ కి చాలామంది డైరెక్టర్స్ తో పరిచయం ఉన్న విషయం తెలిసిందే. హ్యాపీడేస్ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ తన టాలెంట్ తో హ్యాపీగా సినీ ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. ఎప్పటికప్పుడు వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఒక ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు ఈ కార్తికేయ. అర్జున్ సురవరం అందించిన సక్సెస్ తో మంచి స్పీడ్ మీద ఉన్న ఈ హీరో వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తోంది. కార్తికేయ సీక్వెల్ కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మరి నిఖిల్ నిర్మాతగా ఎంత మేరకు రాణిస్తాడో చూడాలి. హీరో గా సెటిల్ అయినంత ఈజీ కాదు, నిర్మాతగా నిలదొక్కుకోవడం. అయితే అటు హీరోగా ఇటు నిర్మాతగా ఏ విధంగా బాలన్స్ చేసుకుంటాడో పోను పోను తెలియనుంది. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ లాగే ఉంది.