యంగ్ హీరో విశాల్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా విశాల్ ఆయనకు ఒక జ్ఞాపికను అందజేశారు. విశాల్ వెంకయ్య నాయుడుకు అందజేసిన ఫోటో ఫ్రేమ్ లో వెంకయ్య నాయుడు సంబంధించిన పలు ఫోటోలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని విశాల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెంకయ్యనాయుడు తో అనేక అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ఇక ఇప్పుడు విశాల్ వెంకయ్య నాయుడు ని కలవడానికి కారణాలు ఏముంటాయి అన్న చర్చ మొదలైంది. విశాల్ తమిళ హీరో అయినప్పటికీ ఆయన తెలుగు మూలాలు కలిగిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగు వారే అన్న సంగతి కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య బేటీ జరిగిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు విశాల్ రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటారు. తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. ఈ నేపథ్యంలో రాజకీయాలపై విశాల్ చర్చించి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాల్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డిటెక్టివ్ సినిమాకు విశాల్ సీక్వెల్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటివరకు విశాల్ చేసిన చాలా సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేశారు. ఆయ నటించిన పందెంకోడి సినిమాతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు. అప్పటినుండి వరుసగా తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే పందెం కోడి సినిమా తర్వాత మాత్రం విశాల్ కు తెలుగులో గుర్తింపు తీసుకువచ్చిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి. సినిమాలు విజయం సాధించాయా లేదా అన్నది పట్టించుకోకుండా ఈ హీరో వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఆయన సినిమాలకు దాదాపు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.