లాక్ డౌన్ అన్ని నేర్పించింది : కాజల్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో  చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఇక ఆ తర్వాత చందమామ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతో   తెలుగు ప్రేక్షకులందరికీ చందమామ గా మారిపోయింది.  ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ను ఏలింది కొన్నేళ్లపాటు.  అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమై దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది.  ఇక చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది యువ హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు.

 కానీ ఇప్పటివరకు కాజల్ కి మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే రేంజ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే కాదు యువ హీరోలతో సైతం జోడీ కట్టి అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ.  ప్రస్తుతం మూడు పదుల వయసు దాటి పోతున్నా అందాల ఆరబోతలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఇటీవలే కాజల్ పెళ్లి చేసుకుంది. దీంతో పెళ్లి తర్వాత కాజల్ కెరియర్ ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది కాజల్ అగర్వాల్.

 ఇకపోతే ఇటీవల లాక్డౌన్ సమయంలో తాను సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నానో అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.  లాక్ డౌన్ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను అంటూ తెలిపింది. తన అత్తయ్య దగ్గర కుట్లు అల్లికలు నేర్చుకున్నా అంటూ తెలిపింది. అంతే కాకుండా ప్రతిరోజూ ధ్యానం చేయడం కూడా అలవాటు చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఇక కుటుంబంలోని రిలేషన్షిప్. సెల్ఫ్ లవ్ గురించి కూడా ఈ లాక్ డౌన్ లో ఎంతో అర్థం చేసుకున్నాను అంటూ టాలీవుడ్ చందమామ కాజల్ తెలిపింది. కాగా ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నాగార్జున సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అదే సమయంలో ఇక తమిళంలో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: