అప్ డేట్ అవుతానంటున్న "దేవత" సీరియల్ నటి ?
ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ అందాల నటి చంటిగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సుందరానికి తొందరెక్కువ, కోకిల, గుణ వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ, భోజ్ పురి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2010లో జెమినీ టీవీ లో వచ్చిన అపరంజి సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మా టీవి లో ప్రసారమౌతున్న దేవత సీరియల్ లో ప్రేక్షకుల్ని అలరిస్తోంది సుహాసిని. ఇందులో ఈమె అమాయకమైన క్యారెక్టర్ కి ప్రేక్షకులు మంత్రముగ్దులు అవుతున్నారు. ఈ సీరియల్ ఈమెకు మరింత గుర్తింపు లభించింది.
అయితే ఇప్పటివరకు సుహాసిని ఎటువంటి సోషల్ మీడియా యాప్ ని వాడకపోవడం ఆశ్చర్యకరం. కాగా త్వరలో సోషల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టబోతున్నా అంటూ తన సీక్రెట్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే క్యాష్ దొరికినంత దోచుకో ప్రోగ్రాంలో పాల్గొన్న ఈమె ఈ విషయాన్ని తెలియజేసింది. నిన్న ఆ షో ఈటీవీలో టెలికాస్ట్ కాగా విషయం కాస్త అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు సుహాసిని సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. అయితే ఇపుడు త్వరలో ఈమె సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయింగ్ ను డబుల్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారన్న మాట.