టిక్ టాక్ నుంచి స్టార్స్ గా ఎదిగిన తెలుగు అమ్మాయిలు..

Divya
ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీని అందుకొని, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్లుగా అవకాశాన్ని కొట్టేస్తున్నారు .అలాంటి వారిలో ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ టిక్ టాక్ అనే సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. అంతే కాదు టిక్ టాక్ లో బాగా ఫేమస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మలు, ఇంస్టాగ్రామ్ లో కూడా తెగ సందడి చేస్తున్నారు. అయితే ఎవరెవరు ఇటీవల సోషల్ మీడియా నుంచి అభిమానులలో బాగా క్రేజ్ ను సంపాదించుకొని, వెండితెర మీద దర్శకుల కంట్లో పడ్డారో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. దీపికా పిల్లి:
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ కాంపిటీషన్ షో కి, రష్మీ తో పాటు స్టేజ్ ని షేర్ చేసుకుంటోంది దీపికా పిల్లి. అంతేకాదు అటు టిక్ టాక్ లోనూ ఇటు ఇంస్టాగ్రామ్ లోనూ తన ఫేమ్ ను మరింత పెంచుకుంటోంది దీపికా పిల్లి.
2. భాను:
ఈమె కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షో లకు గెస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
3. క్రిస్టియన్ రవళి:
ప్రస్తుతం ఈమె కూడా టీవీ షోలలో పాల్గొంటూనే, యూట్యూబ్ లో కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకుల చేత మన్ననలు పొందుతోంది.
4. బన్నీ వాక్స్ ఉరఫ్ వర్షిణి:
ఇక ఈ అమ్మాయి అయితే ఏకంగా వెండితెరపై బిజీ అయిపోయింది. చూడ్డానికి అచ్చం రాశిఖన్నా లా కనిపించడంతో ఈమెకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈమె తొలుత విద్యార్థి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మాయి..

ఇక వీరంతా కూడా మన తెలుగు అమ్మాయిలే. వీరికి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ వీరికి ఉన్న టాలెంట్ తోనే టిక్ టాక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా ఫేమ్ ను సంపాదించుకుని వెండితెరపై బాటలు వేసుకుంటున్నారు. ఇక వీరు కూడా భవిష్యత్తులో మంచి స్టార్ పొజిషన్ ను  అనుభవించాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: