'లక్ష్య' క్లైమాక్స్ షూట్ పూర్తి చేస్తున్న శౌర్య..?

Suma Kallamadi
టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్స‌మ్ హీరో నాగశౌర్య సినీ కెరీర్ లో వస్తున్న మ‌రో మైలురాయి 20వ సినిమా లక్ష్య అని చెప్పాలి. ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి అనే వ్య‌క్తి డైరెక్ష‌న్ చేస్తూ ప‌క్కాగా తెర‌కెక్కించేందుక ట్రై చేస్తున్నారు. కాగా ఈ మూవీ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అండ్ నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ మూవీని తీస్తున్నారు.

ఈ సినిమాకు ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ నారాయణ్ దాస్ కె నారంగ్ తో పాటు పుష్కర్ రామ్మోహన్ రావు అలాగే శరత్ మరార్ నిర్మాతలుగా ఉంటున్నారు. లక్ష్య మూవీలో నాగశౌర్య గ‌తంలో లేనంత‌గా విభిన్నమైన లుక్ లో కనిపించేందుక ట్రై చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా చేస్తుండగా విలక్షణ నటుడు జగపతి బాబుతో పాటు సచిన్ కేడ్కర్ లు క‌లిసి చాలా కీలకమైన పాత్రలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెర‌కెక్కిస్తున్నారు. కాగా నాగశౌర్య తో పాటు జగపతి బాబు ఇతర ప్రధాన నటులు ఈ షూటింగ్‌లో పాల్గొని కీల‌క స‌న్నివేశాల‌ను తీస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా లక్ష్య మూవీ టీమ్ రీసెంట్ గా క్లైమాక్స్ షూట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో నాగ శౌర్యచాలా  ఏకాగ్రతతో లక్ష్యాన్ని కొట్టడానికి రెడీ అవుతూ విల్లు ఎక్కు పెడుతున్నట్లు కనిపించ‌డంల ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియోను చూస్తుంటే క్లైమాక్స్ సీన్ల కోసం లావిష్ గా మూవీ టీమ్ ప‌క్కాగా ఏర్పాట్లు చేసినట్లు అర్థం అవుతోంది.

ఇక మొద‌టిసారి ఇండియాలోనే ఆర్చరీ స్పోర్స్ట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కూడా ఇదేనంట‌. ఇక దీని కోసం నాగ‌శౌర్య ఇప్ప‌టికే భారీ వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేసాడని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: