తల్లి పాత్ర చేయబోతున్న కాజల్?

praveen
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్ద కాలం గడిచి పోతుంది. కానీ ఇప్పటికీ కాజల్ అగర్వాల్ యంగ్ హీరోయిన్ ల మాదిరిగానే తన లుక్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ తన హాట్ హాట్ అందాలను ఒలకబోయడంలో ఎక్కడ లిమిట్స్ పెట్టుకోదు కాజల్ అగర్వాల్.  అయితే ఇటీవలే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.  పెళ్లి తర్వాత కాజల్ ఇక సినిమాలకు దూరం అవుతుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ పెళ్లి తర్వాత మరింత స్పీడ్ తో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్  వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.  కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తోంది కాజల్ అగర్వాల్. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఒకప్పటిలా ఏదిపడితే అది కాకుండా కథల ఎంపికలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ అమ్మడు.  ఇక ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తుంది. ఇంకోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు సిద్ధం అవుతుంది కాజల్ అగర్వాల్.

 ఇకపోతే ఇటీవలే ఈ అమ్మడికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓ తమిళ సినిమాలో ఈ హీరోయిన్ తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధమైంది అంటూ ఒక పుకారు షికారు చేస్తోంది. కాజల్ హీరోయిన్ గా శరవణన్ దర్శకత్వంలో రౌడీ బేబీ అనే సినిమా వస్తోంది. తల్లి కూతుర్ల మధ్య అనుబంధం  నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అట అయితే ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు కాజల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కాజల్ తల్లి పాత్రల్లో నటిస్తుండటంతో అభిమానులకు షాక్ అవుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: