పవన్ కళ్యాణ్ లైనప్ మార్పులతో క్రిష్ లో మొదలైన టెన్షన్ !
ఈసినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అవ్వడంతో ఈమూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల అవ్వడం ఖాయం అని అనుకున్నారు అంతా. అయితే పవన్ ఆలోచనలలో మార్పు వచ్చి ఇప్పుడు పవన్ నటించే మూవీల లైనప్ కూడ మారడంతో ‘హరిహర వీరమల్లు’ స్థానంలో పవన్ రానా లు కలిసి నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ వచ్చి చేరుతుంది అని అంటున్నారు. అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు.
అయితే కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డుతగలడంతో పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ అంతా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లు ప్రారంభం కావడంతో పవన్ ‘హరిహర వీరమల్లు’ కంటే తాను నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ పై పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ ను పట్టుపట్టి మరో మూడు నెలలలో పూర్తిచేసి ఆతరువాత ‘హరిహర వీరమల్లు’ పై దృష్టి పెట్టాలని పవన్ ఆలోచన అని అంటున్నారు.