ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కథానాయికల్లో తాప్సి కూడా ఒకరు. మొదటగా టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి నటిగా తానేంటో నిరూపించుకుంది. ఒకానొక సమయంలో అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్ కి పయనమైంది. అక్కడ చాలా తెలివిగా మంచి కథలనే ఎంచుకుంటూ కెరీర్ లో నిలబడగలిగింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎంచుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్కరూ వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాప్సి తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. నిజంగా ఈమెకు పెళ్లి మీద ఆసక్తి లేదా లేదంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అన్నది తెలియదు కానీ భర్త గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అందరి దృష్టి ఈమెపై నెలకొంది. కనీసం మీరైనా అర్ధం చేసుకుని ఈమె ఉద్దేశ్యం ఏమిటో చెప్పండి.
తాప్సి భర్త గురించి ఏం చెబుతోందంటే ?
నాకు కాబోయే వారు కేవలం నాకు మాత్రమే నచ్చితే సరిపోదని, నా తల్లితండ్రులు కూడా అతనిని ఇష్టపడాలంది. చాలామంది అత్తమామలతో సరిగా ఉండరు. అలాంటి వారంటే నాకు అస్సలు ఇష్టముండదని ఖరాకండిగా చెప్పేసింది. అందరితో కలిసి మెలిసి ఉండేవారంటే నాకు ఇష్టమని తెలిపింది. ఇంతకు ముందు నేను డేట్ చేసిన వారు కూడా ఈ విషయంలో మ్యాచ్ అవ్వకే పెళ్లి చేసుకోలేదని చెప్పింది. పెద్దలు చుసిన పెళ్ళైనా లేదా నేనే ఎంచుకున్నా ముందే ఏఈ విషయాలన్నీ వారితో చర్చిస్తానని ఇవన్నీ ఓకే అనుకుంటేనే పెళ్లి విషయంలో ముందుకు వెళతానని తెగేసి చెప్పేసింది.
నేనెప్పుడూ అవసరం లేకుండా ఎవ్వరితోనూ టైం పాస్ చేయనని, సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసమే ప్రయత్నిస్తానని చెప్పింది. ఈ విధంగా తాప్సి ఆలోచనలు ఉండడంతో, తాప్సి తల్లితండ్రులు ఆమె పెళ్లిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలా పెళ్లి విషయంలో నిబంధనలు పెట్టుకుంటే పెళ్లవడం కష్టమేనని వాపోతున్నారు. మరి త్వరలోనే తాప్సి తల్లితండ్రుల ఆశని అర్ధం చేసుకుని పెళ్లి పెట్టాలెక్కుతుందా చూడాలి.