విజయ్ సినిమా చూపిస్తూ బాలుడికి ఆపరేషన్.. !

MADDIBOINA AJAY KUMAR
మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తే మనకు నొప్పి తెలియకుండా ఉండడానికి పాటలు వింటూనో... సినిమా చూస్తూనో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మన దృష్టిని మొత్తం వాటిపై పెట్టడం వల్ల మనం శారీరకంగా అంతగా అలసిపోము కాబట్టి. ఇలాంటి పరిస్థితిని మనం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్ లో  మత్తు ఇంజక్షన్ కు బదులుగా సినిమా చూపించి ఆపరేషన్ చేయడం విన్నారా. ఇలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన పది సంవత్సరాల బాలుడికి శస్త్రచికిత్స చేయడానికి డాక్టర్లు అంతా సిద్ధం చేశారు. 
ఆపరేషన్ ప్రారంభించే సమయంలో ఆ అబ్బాయి నిరాకరించడంతో ఆ బాలుడికి తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన 'బిగిల్' సినిమాను చూపిస్తూ వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు.

సినిమాలో మునిగిపోయిన బాలుడికి నొప్పి తెలియ‌కుండానే ఆప‌రేష‌న్ జ‌రిగిపోయింది. అయితే నొప్పి ఉంటుంది. కానీ అత‌డికి సినిమా పై ఉన్న ఆస‌క్తితో పెద్ద‌గా నొప్పి తెలియ‌దు అంతే. ఇక ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత వైద్యులను ఈ సినిమా నే చూపించడానికి కారణం ఏమిటి అని అడగగా.... 
ఈ సినిమాలో విజయ్ ఒక ఫుట్ బాల్ 'కోచ్' గా మామూలు ఆట వచ్చిన అమ్మాయిలను గొప్ప ప్లేయర్ లుగా తీర్చిదిద్దే విధానం చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని, మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్లు మనల్ని చూపు తిప్ప నివ్వకుండా చేస్తాయని అలాంటి సినిమా అయితేనే  తన కాన్సంట్రేషన్ మొత్తాన్ని సినిమాపై పెట్టగలడు అనే ఉద్దేశంతో ఈ సినిమాను ఎంచుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం పట్ల విజయ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఈ విషయం పై హీరో విజయ్  స్పందిస్తాడో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: