ఓంకార్ షోలో పవన్’ డైలాగ్స్‌తో అదరగొట్టిన బండ్ల గణేష్..!!
అయితే ఓంకార్ హోస్ట్‌గా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న సిక్త్స్‌సెన్స్ షోలో ఆయన హావభావాలు, స్టైల్ ట్రెండింగ్‌గా మారింది. ఇక వన్ సెకన్ అంటూ కంటెస్టెంట్లను, సెలబ్రిటీల గుండెల్లో దడపుట్టించే ఆయన ట్రేడ్ మార్క్ వార్నింగ్ ఇప్పుడు అందరిని ఫాలో అయ్యేలా చేస్తుంది. అయితే సిక్త్‌సెన్స్ షోలో భాగంగా స్క్రీన్‌పై ప్రదర్శించిన ఓ ప్రోమో వీడియోను చూసిన నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాడు.
ఇక పవన్ కల్యాణ్ బెల్ట్‌ను నువ్వే కొనిపెట్టావా అంటూ ఓంకార్ బండ్ల గణేష్ ని ప్రశ్నించాడు. అయితే ఓంకార్ ప్రశ్నకు ఆయన ఇలా స్పందిస్తూ.. వెంకటేశ్వర స్వామి ఎలాంటి ఉత్సవాలు చేస్తారో డాలర్ శేషాద్రికి తెలియదా? అలాగే పవర్ స్టార్ గురించి నాకు తెలియదా అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ గురించి మరోసారి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నా దేవర, నా దేవుడు, నా సర్వస్వం, నా ఆస్తి.. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా అంటూ డైలాగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు.
ఆ తరువాత బండ్ల గణేష్ తన కూతురు గురించి చెబుతూ... నా జీవితంలో నా కూతురు రెండే రెండు ప్రశ్నలు వేశారని అన్నారు. అయితే పవన్ కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తారు? ఓంకార్ అన్నయ్య నిర్వహించే సిక్త్‌సెన్స్ షోకు ఎప్పుడు తీసుకెళ్తావు అని అడిగిందని అన్నారు. ఇక అది నీకు ఉన్న క్రెడిబిలిటి అంటూ బండ్ల గణేష్ డైలాగుల వర్షం కురిపించారు.