బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'పుష్ప' కి బ్రేక్..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పుష్ప'.సౌత్ సినీ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో పుష్ప కూడా ఒకటి.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రో టీజర్ నేషనల్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ని సోమవారం మొదలుపెట్టాలని పక్కా ప్లానింగ్ తో ఉన్న చిత్ర టీమ్.. ఉన్నట్టుండి షూటింగ్ ని క్యాన్సల్ చేయడం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని ప్రకటించడంతో..


 అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకేసాయి.ఈ కరోనా మహమ్మారి లేకపోయుంటే ఇప్పటికే రిలీజ్ హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.దీంతో ఆగస్టు 13 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొంత ఆలస్యంగా రానుంది.ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా నయా షెడ్యూల్ సోమవారం ఉదయం మొదలు పెట్టాలని ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్న చిత్ర యూనిట్..అనుకోకుండా చివరి నిమిషంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఇలా ఉన్నట్టుండి షూటింగ్ ఆపేయడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.అయితే అందుతున్న సమాచారం ప్రకారం..


 బహుశా ఎవరైనా యాక్టర్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్లనే ఇలా చివరి నిమిషంలో షూటింగ్ క్యాన్సిల్ చేసి ఉండవచ్చనే టాక్ కూడా నడుస్తోంది ఫిల్మ్ నగర్ లో.మళ్ళీ తిరిగి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మాత్రం తెలియదు.ఇక ఇప్పటికే సినిమా మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది.ఇంకా కేవలం కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. వాటిని కూడా త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానుందట చిత్ర బృందం.ఇక ఐకాన్ సినిమాను పూర్తి చేసిన తర్వాత పుష్ప పార్ట్2 షూటింగ్ ని ఫినిష్ చేయనున్నాడట బన్నీ.ఇక మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: