సినీ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఏపీ, తెలంగాణ‌లో థియేట‌ర్ల రీ ఓపెన్‌... రూల్స్ ఇవే

VUYYURU SUBHASH


రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్‌ సినిమా రిలీజ్ టైం లో థియేటర్లు రీ ఓపెన్ చేసినా నెల రోజులకే మళ్లీ కరోనా కారణంగా మూసివేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో ఏపీ, తెలంగాణలో థియేటర్లను పునః ప్రారంభించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు ప్రారంభించుకోవచ్చు ని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోనూ థియేటర్లను రీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఎప్పటినుంచి ప్రదర్శనలు ప్రారంభించాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
అయితే తెలంగాణ‌లో మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను ప్రారంభిస్తున్నార‌ట‌. మరోవైపు ఏపీలో థియేటర్లలో టిక్కెట్ల రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్లు కౌన్సిల్ సైతం ఆందోళనలో ఉంది. ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ టిక్కెట్ రేట్ల‌తో తాము సినిమాలు రిలీజ్ చేయలేమ‌ని వారు చెప్పేస్తున్నారు. మరోవైపు అగ్ర నిర్మాతలు సైతం తాము నిర్మిస్తున్న సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ఆధిపత్యం పెరుగుతుండడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ వరకు వేచి చూడాలని.. అప్పటికి పరిస్థితులు చక్కబడ‌క పోతే అప్పుడు పెద్ద సినిమాలు సైతం ఓటీటీ లో రిలీజ్ చేసుకోవచ్చని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
మ‌రోవైపు సినిమాల షూటింగ్ లు కూడా ప్రారంభిస్తున్నారు. కొత్త సినిమాల షూటింగ్‌లు కూడా మొద‌ల‌వుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల‌తో పాటు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాల‌నుకుంట‌న్న సినిమాల షూటింగ్‌ల‌ను కూడా త్వ‌ర‌లోనే ఫినిష్ చేయ‌నున్నారు. ఎన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసినా ఇప్పుడు వెంట‌నే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: