నిరుపమ్ పరిటాల... ఈ పేరు అనగానే ఎవరికీ తెలికపోవచ్చు కానీ డాక్టర్ బాబు అనగానే అందరు ఇట్టే గుర్తుపటేస్తారు.డాక్టర్ బాబు పేరుతో అంతలా ఫేమస్ అయ్యాడు మన బుల్లితెర హీరో నిరుపమ్ పరిటాల.నిరుపమ్ గురుంచి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే బుల్లితెర శోభన్ బాబు మారిపోయాడు నిరుపమ్.డాక్టర్ బాబు పేరుతో కార్తీకదీపం సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఈయన ఎంతగా బిజీ అయిపోయాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మొదట్లో చంద్రముఖి సీరియల్ తో మంచి పెరు గుర్తింపు తెచ్చుకున్న నిరుపమ్..ఆ తర్వాత కార్తికాదీపం సీరియల్ తో నెంబర్ వన్ గా మారి..ఎనలేని క్రేజ్ సంపాదిచుకున్నాడు ఈ డాక్టర్ బాబు.
ఇక సోషల్ మీడియాలలో నిరూపం మీద వచ్చే మీమ్స్ సైతం అందరి ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఇక డాక్టర్ బాబు భార్య అయిన మంజుల బుల్లితెరకి సుపరిచితురాలే.మంజుల కూడా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరఅయింది.మంజుల నాన్న గారి స్నేహితుడు తన సీరియల్లో హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆ అడిషన్స్ కి ఈమెని తీసుకెళ్లారు. అప్పుడు తను ఇంటర్ చదువుతోంది.ఆ అడిషన్స్ లో ఇమేని చూసిన యూనిటీ సభ్యులు హీరోయిన్ గా తనని ఎంపిక చేసారు.ఒకవైపు చదువు కొనసాగిస్తూ అటు కన్నడ లో ఐదు సీరియల్స్ లో నటిచి తనకు నటనపై ఎంత ఆసక్తి ఉందో అందరికి అర్ధం అయేలా తెలియపరిచింది.
ఇక ఆ తర్వాత తెలుగు లో వచ్చిన చంద్రముఖి సీరియల్ లో చాన్స్ కొట్టేసింది మంజుల. చంద్రముఖి సీరియల్ చేస్తున్నపుడు నిరుపమ్ తో ప్రేమలో పడింది ఈ అమ్మడు.ఇక అక్కడి నుంచి విల్ల ప్రయాణం మొదలైంది.ఆ సీరియల్ తో వీళ్ళకెరియర్ మాత్రమే కాదు లవ్ కూడా మొదలైది.అలా ఆ సీరియల్ నడుస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరు ఆ తరువాత పెళ్ళి చేసుకున్నారు.ఇక ఇప్పుడు ఎవరి సీరియల్స్ తో వాళ్లు బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు.ఇక బుల్లితెర స్టార్ మా ఛానెల్ లో నిరూపమ్ నటిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది...!!