అల్లూరి సీతారామరాజు అసలు పేరిదే.. అసలేం జరిగిందో తెలుసా ?

VAMSI
మన భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి నేటికి 64 సంవత్సరాలు గడుస్తున్నా ఈ నాటికీ వారిని గౌరవంగా స్మరించుకుంటున్నాము. అటువంటి మహానుభావులలో ఒకరే మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయనకు ప్రజలలో ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. బ్రిటిష్ దొరలపై అల్లూరి చేసిన పోరాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అప్పట్లో తన దగ్గర ఉన్న అతి తక్కువ ఆయుధ వనరులతో బలమైన బ్రిటిష్ సైనికులను ఎదుర్కొన్నాడు. సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యం సాధించగలమని నమ్మి ముందుకెళ్లాడు. ఆ రోజుల్లో అల్లూరి అంటే బ్రిటిష్ దొరలకు ఉచ్చ పడేది. అల్లూరి సిద్ధాంతానికి ముగ్ధులైన ఎంతోమంది అమాయకులు మరియు చదువులేని వారు ఆయన వెనుక పోరాటంలో పాల్గొన్నారు. ఈయన నాయకత్వంలో బ్రిటిష్ వారిని ఉరుకులు పరుగులు పెట్టించాడు.

ఈ అభం శుభం తెలియని గిరిజన ప్రజలలో చైతన్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వారికి యుద్దానికి అవసరం అయిన విద్యలన్నింటినీ నేర్పించి వీరులుగా తీర్చిదిద్దాడు.  ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో అల్లూరి ఎన్నో విప్లవాలు చేశాడు. చివరికి బ్రిటిష్ వాళ్ళు ఇతనిని ఏమీ చేయలేక ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే తానే స్వయంగా పోలీసులకు దొరికిపోయాడు. అలా పోలీసుల చేతుల్లో కేవలం 27 సంవత్సరాల వయసులో వీరమరణం పొందాడు. అంతటి వీరుడు ఈ రోజు జన్మించాడు. ఈ సందర్భంగా అల్లూరి గురించి  మీకు తెలియని ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి అందరూ అనుకుంటున్నట్లుగా అల్లూరి పేరు సీతారామరాజు కాదట. ఇతనికి అల్లూరి తాతగారు అయినటువంటి మందపాటి రామరాజు పేరే పెట్టారట. అల్లూరి శ్రీరామరాజు ఇతని అసలు పేరు కావడం విశేషం. ఈ పేరే అల్లూరి రాసిన "మను చరిత్ర" గ్రంధం పైన కూడా ఉంది. కానీ సీత అనే స్త్రీ అల్లూరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందట. అయితే అల్లూరి ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందున ఆమె మరణించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ విధంగా ఆమె ప్రేమకు ప్రతీకగా ఈయన పేరును అల్లూరి సీతారామరాజుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: