బర్త్ డే స్పెషల్: S.V. రంగారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

Divya

సినిమారంగంలో శిఖరాలను అధిరోహించిన మహానటులలో యస్. వీ. రంగారావు గారు కూడా   ఒకరు. ఈయనకు నట సార్వభౌమ , విశ్వనట చక్రవర్తి అని బిరుదులు కూడా కలవు. ఈయన జూలై 3వ తేదీన 1918 వ సంవత్సరంలో  మద్రాసులోని నూజివీడు లో  జన్మించారు. ఈయన తెలుగు, తమిళ భాషల్లో కూడా రచనలకు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. అంతేకాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరించేవారు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలోనే తన జీవితాన్ని గడిపేశారు. అయితే ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఎస్వీ రంగారావు తను చదువుకునే వయసులోనే మొదటిసారి నాటకం వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలా ఆయన నటుడు కావాలనే  కోరిక చాలా బలంగా నాటుకుపోయిందట. ఎస్ వి రంగారావు గారికి ఆటలు అంటే చాలా ఇష్టమట. ఈయన సినిమా వైపు ఉంటూనే క్రికెట్, వాలీబాల్,షటిల్ వంటివి ఆడుతూ ఉండేవారు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే, ఈయన ఇంటర్ చదువుతున్న సమయంలో 45 మంది ఎగ్జామ్స్ రాయగా.. ఆయన ఒక్కడే పాసయ్యారు. చదువులో ఎంత గొప్పవారో  మనకి అర్థమవుతుంది. కాకినాడలోని  యంగ్ మ్యాన్స్  అనే క్లబ్ లో  చేరి అక్కడ ఎన్నో నాటకాలలో పాల్గొన్నారు. ఈయనకు ఇక్కడే"రేలంగి సుబ్బారావు, అంజలి దేవి, ఆదినారాయణ రావు, B.A.సుబ్బారావు" వంటి ప్రముఖులు పరిచయం అయ్యారు. తన స్నేహితుడి సహాయంతో"అగ్నిమాపక శాఖ"లో పోస్టలు  పడడంతో  , ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సంపాదించాడు.
ఉద్యోగం చేస్తున్న సమయంలో  తన నుంచి తన కల దూరం అవుతుందనే భావనతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.1947 లో వచ్చిన"వరుధిని "అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టాడు. తన తొలి సినిమాలోని పాత్రకు 50 రూపాయలు పారితోషకం తీసుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు. ఈయన మళ్ళీ ఉద్యోగ వేట లో వెళ్లి"TATA"కంపెనీలో అసిస్టెంట్ గా చేరారు.
ఎస్వీ రంగారావు గారికి "పల్లెటూరు పిల్లవాడు" అనే సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి పిలువగా.. ఇప్పటికే తన తండ్రి మరణించడంతో ఆయన మద్రాస్ కి చేరుకోలేక పోయాడు. అలా సినిమాలో నటించే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత బి.నాగిరెడ్డి, చక్రపాణి కలిసి "విజయ ప్రొడక్షన్" అనే కొత్త బ్యానర్ లో ఒక సినిమాను నిర్మించబోతున్నారు. అదే "షావుకారు"  సినిమాలో రంగారావు కీలకమైన పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.ఈ సినిమాతో తనకి గట్టి పునాదిని వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇదే సంస్థపై నిర్మించిన మరొక చిత్రం"పాతాళ భైరవి". ఈ సినిమాలో మాంత్రికుడి వేషం ఇచ్చారు. ఇక ఈ సినిమాతో మంచి పేరు సంపాదించారు.
సంతానం అనే సినిమా కోసం అంధుడి పాత్ర నటించడానికి  తాను కొద్ది రోజులు శిక్షణ పొందాడట. ఎస్వీ రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం"చదరంగం"సినిమా కి రెండవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఇదే సమయంలో తన మేనమామ కుమార్తెను "లీలావతిని" 1947 డిసెంబర్ 27 వివాహం చేసుకున్నారు. చివరిగా 1974 జూలై 18వ తేదీన గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: