ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

Divya

ఆరడుగుల పొడవు.. ఏడడుగుల బంధం.. అనగానే ముందుగా గుర్తొచ్చే జోడి ప్రభాస్ - అనుష్క. వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో గొప్ప స్టార్ హీరో హీరోయిన్లు అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, బాహుబలి సినిమా ద్వారా బాగా పాపులారిటీ అందుకున్నారు. బాహుబలి - 2 సినిమా  ద్వారా  ప్రపంచవ్యాప్తంగా ఈ జోడి మంచి గుర్తింపు పొందింది. తెలుగులో వీరిద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి వంటి చిత్రాలలో కలిసి నటించి ,మంచి జోడీ గా గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమాల ద్వారా మంచి సక్సెస్ ను  కూడా అందుకున్నారు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే, 2002 వ సంవత్సరంలో ఈశ్వర్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి , తన సత్తా చాటుతున్నాడు. ఇక అంతేకాదు ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ముఖ్యంగా ఈయన సినిమాలన్నీ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోనే నిర్మించడం గమనార్హం. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లు సైతం, ప్రస్తుతం తెలుగులో సినిమా చేయాల్సి వస్తే, ఈయన తోనే సినిమా చేస్తామంటూ భీష్మించుకుని కూర్చున్న విషయం కూడా తెలిసిందే.
ఇక అనుష్క విషయానికి వస్తే, 2005వ సంవత్సరంలో సూపర్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో వచ్చిన అరుంధతి చిత్రం ద్వారా బాగా పాపులారిటీ అందుతుంది. అనుష్క అప్పటివరకు అమాయకపు యాంగిల్లో నటించిన ఈమె , ఒక్కసారిగా తన రౌద్రాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు ఈ సినిమాతో ఆమె తెచ్చుకున్న క్రేజ్ ను, ఇప్పటికీ ఏ ఒక్క హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేదు అనే చెప్పవచ్చు.

ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు చాలా ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కలిసి వెళ్లడం , సన్నిహితంగా ఉన్నడం  చూసిన ప్రతి ఒక్కరు, వీరిద్దరి మధ్య ఖచ్చితంగా లవ్ ట్రాక్ నడుస్తోందని అనుకునే వారు. కానీ ఈ వార్తలపై అనుష్క ఎన్నోసార్లు స్పందించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం సాగడం లేదని ,మేమిద్దరం మంచి మిత్రులుగా జీవితాంతం ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మంచి మిత్రులు కలిసి ఉంటే, అందులో ఆడ - మగ అయితే ఇలాంటి రూమర్స్ తప్పవు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: