ఓటిటిలో అలాంటి సినిమాలకు మోక్షం..!

shami
థియేటర్లు మూతపడటం వల్ల డిజిటల్ రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. స్టార్ సినిమాల కూడా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అంటే డిజిటల్ మార్కెట్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందని చెప్పొచ్చు. ఎలాగు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబట్టి సినిమా బడ్జెట్ ని బట్టి కొద్దిపాటి లాభాలు కూడా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలే కాదు ఏవో కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయిన సినిమాలకు ఓటిటి లు వరంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ ను సౌత్ భాషల్లో రీమేక్ చేశారు. నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోయిన్స్ ను పెట్టి మరి సినిమా చేశారు. అయితే ఈ సినిమా ఏ ఒక్క భాషలో రిలీజ్ అవలేదు. తెలుగులో తమన్నా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు దట్ ఈజ్ మహాలక్ష్మి అని పెట్టరు. ఇక ఇదే సినిమా తమిళంలో కాజల్ హీరోయిన్ గా నటించింది. పారిస్ పారిస్ టైటిల్ తో ఈ సినిమా చేశారు. తెలుగులో కన్నా తమిళంలో బూతులు, అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందని ఆ సినిమా అక్కడ రిలీజ్ ఆపేశారు.

ఇక ఇప్పుడు పారిస్ పారిస్ ను ఓటిటి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ పారిస్ పారిస్ కు ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారట. కోలీవుడ్ క్వీన్ రిలీజ్ అవుతుంది అంటే తెలుగు క్వీన్ కూడా ఓటిటి బాట పట్టే అవకాశం ఉంటుంది. ఎలాగు తమన్నాకి ఓటిటిలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి దట్ ఈజ్ మహాలక్ష్మికి తెలుగు ఓటిటి డీల్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో తమన్నా క్వీన్ మూవీ కూడా మన దగ్గర రిలీజ్ చేస్తారనుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: