ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

praveen
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ తాప్సీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొగుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత తెలుగులో అవకాశాలు అందుకుంది. అయితే తన నటనతో తన అందాలతో ఆకట్టుకున్నప్పటికి స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం సంపాదించలేకపోయింది తాప్సీ.  ఇక ఆ తరువాత తెలుగులో అవకాశాలు తక్కువ అవుతున్న సమయంలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 అక్కడ ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసొచ్చింది. అక్కడ కేవలం తన అందాల పైనే ఆధార పడకుండా తన నటనకు కూడా పని చెప్పింది తాప్సీ.  నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే అప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మొన్నటి వరకు కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలలో మాత్రమే నటించిన తాప్సీ ఇప్పుడు బోల్డ్ పాత్రల్లో కూడా నటిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ఇటీవలే తన బోల్డ్ పాత్రల గురించి తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 తనతో రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు నటులు విక్రాంత్, హర్షవర్ధన్ భయపడ్డారు అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. హాసిన్ దిల్ రుబా అనే మూవీ ప్రచారంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది తాప్సీ. తన స్టార్ డం లేదా మరేదైనా కారణం వల్ల తనతో రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు ఆ ఇద్దరు నటులు భయపడి ఉండొచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తన పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్ లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇకపోతే వినీల్ మ్యాత్యు డైరెక్షన్లో తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 2వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దీని కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: