సోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని కోట్లా..?

Suma Kallamadi
గతేడాది భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో సోనూ సూద్ సహాయం చేయడం ప్రారంభించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆయన పెద్ద మనసుతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. సోనూ సూద్ అనే యాక్టర్ వున్నారని తెలియని ప్రజలు కూడా ఇప్పుడు అతన్ని ఆరాధిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. దేవుడి దర్శనం కోసం కాలినడకన నడిచినట్టు సోనూ సూద్ దర్శనం కోసం కాలినడకన నడిచే ప్రజలు కూడా ఉన్నారంటే ఆయన ప్రజల మనసుల్లో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించారో అర్థం చేసుకోవచ్చు.
ఫస్ట్ వేవ్ లో అభాగ్యులను ఆదుకున్న సోనూ సూద్ సెకండ్ వేవ్ లో కూడా అడిగిన వారికల్లా కాదనకుండా సహాయం చేస్తున్నారు. తన ద్వారా లక్షల మంది ప్రజలు సాయం పొందాలనే ఉద్దేశంతో ఆయన దేశవ్యాప్తంగా 4 వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఎందరో కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి వారి ప్రాణాలను కాపాడారు. ఇంకా ఎన్నో విధాలుగా ఆయన సహాయం అందించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలను వింటూ సాధ్యమైనంతవరకు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా కూడా సోనూ ప్రజలకు సహాయం చేస్తున్నారని ప్రతి ఒక్కరికీ తెలిసింది. అందుకే ఆపదలో ఉన్న చాలామందికి మొదటిగా సోనూ సూద్ సోషల్ మీడియానే గుర్తుకు వస్తుంది. మొన్నటి వరకు సోషల్ మీడియా ఖాతాలు లేని వారు కూడా కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని సోనూసూద్ ని ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన సేవా దృక్పథానికి ఫిదా అవుతూ చాలామంది ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని ఫాలో చేస్తున్నారు. సోనూ సూద్ అసలైన రియల్ హీరో అనే భావంతో కోట్ల మంది ప్రజలు ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆయనకు 1 కోటి 20 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఒక కోటి ఫాలోయర్స్ సాధించిన అతి తక్కువ మందిలో ఇప్పుడు సోనూ సూద్ కూడా ఒకరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: