వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?
కాగా ఈ ఫొటోను ప్రస్తుతం నెటిజన్లు లైక్ లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. కాగా ఫొటోలో ఉన్న వారందరిలో హీరో రాజశేఖర్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. స్టార్ హీరోగా మారారు. ఇప్పటికి కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ... హిట్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తెలు శివాని, శివాత్మిక టాలీవుడ్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ ఫొటోలో ఉన్న మరో హీరో వెంకటేశ్ ను కూడా మనం తక్కువగా బయట చూస్తుంటాం. తన నట జీవితంలో 74 సినిమాలు పూర్తి చేసుకున్నా కూడా వెంకటేశ్ బయట కనిపించేది తక్కువనే చెప్పొచ్చు. ఇకపోతే మన్మధుడు నాగార్జున విషయానికి వస్తే... ఆయన బయటి ఫంక్షన్లలో తరచూ.. కనిపిస్తుంటారు. ఇప్పటికీ ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. తన సొంత బ్యానర్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుంటే... 1990లలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మెంటైన్ చేస్తున్న హీరో ఆయన. ప్రస్తుతం మోగాస్టార్ గా పరిశ్రమలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. పై చిత్రం 1990లలో తీసిందని తెలిసిపోతుంది. కాగా అప్పుడు హీరోలు ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ లోనే కలుసుకునేవారు.. ఈ ఫొటోలో ఉన్నవారందరూ ఏదో విషయం గురించి సీరియస్ గా మాట్లాడుతున్నట్లు చూస్తేనే తెలిసిపోతుంది. ఆ ఫోటోలో మెగాస్టార్ తో పాటు వీరంతా ఏదో సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.