నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

Divya

ఆర్ కె రోజా. ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగి, అందరి చేత మన్ననలు పొందుతున్న ఏకైక నటి. అంతేకాదు ఈమె జబర్దస్త్ లాంటి కామెడీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ అటు ప్రేక్షకులకు , ఇటు రాజకీయ పరంగా ప్రజలకు దగ్గరవుతూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటోంది. ఇక నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసి గెలిచింది. ఇక ప్రస్తుతం ఏపీ ఐ ఐ సీ  చైర్మన్ గా నియమించారు.

రోజా సినీ ఇండస్ట్రీలోకి రాకముందు కూచిపూడి నేర్చుకొని, నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చేది. ఇక మొదటి సారి రాజేంద్రప్రసాద్ హీరోగా 1991 లో వచ్చిన ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశం చేసింది. ఇక ఆ తర్వాత 1991 నుండి 2002 సంవత్సరం వరకు తెలుగు , తమిళ చిత్రాలలో హీరోయిన్ గా  తన హవా కొనసాగించింది. ఆ తర్వాత కన్నడ,మలయాళం లో కొన్ని చిత్రాల్లో కూడా నటించి, సినీ ఇండస్ట్రీలో తిరిగి చూడలేదు. అలా 1991లో మొదలైన తన సినీ ప్రస్థానం 2015వరకు నటిగా కొనసాగింది. తర్వాత బుల్లితెరపై ప్రవేశం చేసి తన సత్తా ఏంటో చాటింది.

ఇక తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించిన రోజా, తనకు ఒక సినిమా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన జీవితంలో ఆ చిత్రానికి ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందట. అదే నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య కు ఉన్న భక్తిని చాటి చెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె ప్రధాన రోల్ చేయక పోయినప్పటికీ, ఇలాంటి చిత్రంలో నటించడం తను చేసుకున్న పుణ్యం అని పలు సందర్భాలలో వ్యాఖ్యానించింది.
ఏడుకొండల వాడి దయ వల్లే నేడు నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని కూడా రోజా  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: