ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

praveen
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే మంచి స్థానం సంపాదించుకుని ఇక సినిమా ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తూ ఉంటారు. కానీ కొంత మంది హీరోయిన్లకు మాత్రం ఎందుకో అంత అదృష్టం కలిసి రాదు. సినిమా ఇండస్ట్రీ లో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం మాత్రం తప్పనిసరిగా కావాలి. ఇక అదృష్టం కలిసి రాలేదు అంటే టాలెంటు ఉన్నా  అనుకున్నంత క్రేజ్ రావడం మాత్రం చాలా కష్టమే.

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా టాలెంట్ ఉండి సరైన క్రేజ్ రాక కనుమరుగవుతున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించినప్పటికీ.. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఎందుకో కొంత మంది హీరోయిన్లకు మాత్రం అంతగా టైం కలిసి రాదు. అలాంటి హీరోయిన్లలో ఒకరు కార్తిక.  రంగం  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక.

 అయితే రంగం సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో నటించింది.  ఈ సినిమాలో కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కార్తీక. ఇక ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బ్రదర్ అఫ్ బొమ్మాలి అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఇక మూడు సినిమాల్లో రంగం ఒకటి మంచి విజయం సాధించింది. మిగతా రెండు సినిమాలు అంతంతమాత్రంగానే ప్రేక్షకులను అలరించాయి. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు ఒక కీలక నిర్ణయం తీసుకుందట. నటనకు గుడ్బై చెప్పాలని భావిస్తోందట. యాక్టింగ్ నుంచి తప్పుకొని ఇక ప్రస్తుతం నిర్వహిస్తున్న యు టి ఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ డైరెక్టర్ గా కొనసాగాలని కార్తీక భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: