పవర్ స్టార్ ఖుషి.. ఫ్యాన్స్ కు ఎందుకంత క్రేజ్ అంటే..?

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. తమిళ దర్శకుడు ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింద్ది. పవన్, భూమికల లవ్ స్టోరీగా వచ్చిన ఖుషి ప్రేక్ష్హకులను అలరించంది. సినిమాలో పవర్ స్టార్ స్టైల్ ఫ్యాన్స్ కు బీభత్సంగా నచ్చేసింది. ఈ సినిమాను ఎస్.జే సూర్య తమిళంలో కూడా తీశాడు అక్కడ కన్నా తెలుగులోనే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఖుషి సినిమా పవర్ స్టార్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. హీరో, హీరోయిన్ ల మధ్య ఈగోలతో సినిమా కథ నడిచింది. సినిమాలో డైలాగ్స్, సాంగ్స్ అన్ని ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చాయి. అయితే ఖుషి సినిమా రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు బజ్ మాములుగా ఉండగా రెండు, మూడు రోజుల తర్వాత సినిమాకు ఆడియెన్స్ రిసీవ్ చేసుకుని ఆ తర్వాత హౌజ్ ఫుల్ షోస్ పడ్డాయి. ఖుషితో పవన్ ఇమేజ్ మరింత పెరిగింది. ఆల్రెడీ పవర్ స్టార్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉండగా ఖుషి సినిమాతో అది డబుల్ అయ్యింది.

ఎస్.జే సూర్య డైరక్షన్, మణిశర్మ మ్యూజిక్, పవన్, భూమిక యాక్టింగ్ ఖుషి సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఖుషి సినిమా పవన్ కెరియర్ లో బంపర్ హిట్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత పదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. మధ్యలో జల్సా పర్వాలేదు అనిపించినా గబ్బర్ సింగ్ రికార్డ్ కలక్షన్స్ చేసింది. గబ్బర్ సింగ్ నుండి పవన్ ఆ హిట్ మేనియా కొనసాగించారు. ఖుషి తర్వాత మాత్రం దాదాపు పదేళ్ల దాకా సూపర్ హిట్ కు దూరమయ్యారు పవన్ కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: