గిరిబాబు చిన్న కొడుకు అందుకే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడా..?

Divya

గిరిబాబు సినీ ఇండస్ట్రీ లో మంచి పేరున్న నటుడు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు విలన్ గా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు రంగాల్లో రాణిస్తూ ,తనకంటూ తనకంటూ ఒక  ప్రత్యేకతను చాటుకున్నారు. ఈయన చేసే ఏ పాత్ర అయినా సరే, ఆ  పాత్రలో ఒదిగిపోయి మరీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక ఇప్పటికీ టాలీవుడ్ లో ఎన్నో వేషాలతో అలరిస్తూ, నాటి తరం నుంచి నేటి తరం వరకు బాగా సుపరిచితులు అయ్యారు గిరిబాబు గారు. అయితే ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అందులో పెద్ద కుమారుడు రఘు బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితుడు.
రఘు బాబు స్టార్ హీరోల సినిమాలలో కామెడీ విలన్ గా, కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అలరిస్తున్నాడు. చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలలో నటించడంతో ఈయన ఇమేజ్ కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా రఘు బాబు ఇంత మంచి ఇమేజ్ ను పొందడానికి ఆయన తండ్రి గిరిబాబు గారు కారణం అని చెప్పవచ్చు. గిరిబాబు గారు మొదట తన కొడుకులు  ఇద్దరిని సినీ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేద్దాం అనుకున్నారు. కానీ రఘు బాబు కమెడియన్ గా ప్రేక్షకులను బాగా అలరించి, అందులో సక్సెస్ అయ్యారు.
కనీసం చిన్న కొడుకు బోసు బాబు నైనా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేద్దాం అనుకుని, ఇంద్రజిత్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా అవకాశం ఇప్పించారు. అలా మొదటిసారిగా గిరిబాబు గారు చిన్న కొడుకు బోసు బాబు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొదమ సింహం సినిమా రిలీజ్ కావడంతో, ఇక ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఇక బోసు బాబు గారు నటించిన సినిమాని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక బయ్యర్లు కూడా సగం ధరకే కొనడం గమనార్హం.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో చమ్మా చక్కా అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆయనకు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు దక్కలేదు. ఇక ఆయన సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: