విలక్షణ పాత్రలకు కెరాఫ్ గా మారిన కమలహాసన్..

Satvika
లోక నాయకుడు కమలహాసన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..  అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు, ఎన్నో రకాల పాత్రల లో నటించి మెప్పించాడు. తమిళ్, తెలుగు ప్రజలను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన నటించే పాత్రలో జీవించి నటిస్తారు. అందుకే ఇప్పుడు జనం మెచ్చిన నటుల జాబితాలో చేరారు.. కమల్ ఒక్కో ఒక్కో విభిన్న పాత్రలో నటించాడు.. దశావతారం సినిమా లో మాత్రం ఒకేసారి పది అవతారాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు.



దశావతారం 2008 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఈ సినిమాలో కమల్ పది రకాల విభిన్నమయిన వేషాలు ధరించి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు. ఆసిన్, జయప్రద నాయికలుగా నటించారు. ఈ సినిమా లో గోవింద్ అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల ను దృష్టిలో ఉంచుకొని మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హాజరవుతాడు..

అలా అక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది.. కట్ చేస్తే.. కమల హాసన్ ఉన్న ల్యాబ్ లో ఒక రకమైన క్రిమి బాంబ్ ను తయారు చేస్తారు.. దాని వల్ల ప్రపంచం అంతమవుతుంది. అది ఓ గ్రామం లోని బామ్మకు వస్తుంది. దాన్ని  వెతుక్కుంటూ హీరో వస్తాడు. అలా హీరోయిన్ కలుస్తాడు. ఈ క్రమంలో మిగిలిన తొమ్మిది అవతారాలను కలుసుకుంటాడు. ఈ దేశాన్ని కాపాడి రియల్ హీరో అవుతాడు. ఒక్కో పాత్రలో కమల్ నటన అమోహం.. ఆ పాత్రకు కమల్ తప్ప మరెవ్వరు సెట్కా రు అన్నంతగా జీవించి నటించాడు.  ఆలా లోకనాయకుడు అయ్యాడు.. ఇలాంటి పాత్రను ఒకే స్క్రీన్ పై చూపించిన చిత్ర డైరెక్టర్ కు , నటించిన కమల్ హాసన్ కు హ్యాట్సాఫ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: