శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !

Seetha Sailaja

బాలయ్యకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోలేము. బోళా మనస్తత్వం ఉన్న బాలయ్య ఈమధ్య శ్రీకాంత్ కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి మొదటిగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కెరియర్ శ్రీకాంత్ సొంతం.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకాంత్ కెరియర్ ఏమాత్రం బాగుండటం లేదు. అతడు హీరోగా నటించిన సినిమాలు కనీసం రెండవ వారం పోష్టర్ కూడ చూడకుండానే వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో శ్రీకాంత్ తిరిగి యూటర్న్ తీసుకుని ఆమధ్య ఒకటి రెండు సినిమాలలో విలన్ కేరెక్టర్ లలో నటించినప్పటికీ ఆ ప్రయోగం శ్రీకాంత్ కెరియర్ కు ఏమాత్రం సహాయపడలేదు.
ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ ‘అఖండ’ మూవీలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా ఎంపిక కావడంతో ఆ మూవీ పై అతడు చాల ఆశలు పెట్టుకున్నాడు. దీనికితోడు ఈమూవీ షూటింగ్ సమయంలో బాలయ్య శ్రీకాంత్ కు నటన పరంగా ఎన్నో సలహాలు ఇవ్వడమే కాకుండా ఆ మూవీలో అతడి విలన్ పాత్ర హైలెట్ గా మారేందుకు బాలయ్య ఎంతో సహకరించాడట.

గతంలో ‘లెజెండ్’ మూవీ షూటింగ్ సమయంలో కూడ బాలయ్య జగపతి బాబుకు ఇలాగే సహకరించి ఆ మూవీలో జగపతి బాబు విలన్ పాత్రను హైలెట్ గా మార్చాడు. ఇప్పుడు ‘అఖండ’ లో కూడ ఇదే జరుగుతూ ఉండటంతో ఈ మూవీ విడుదల తరువాత శ్రీకాంత్ విలన్ కెరియర్ కు ఇక ఎదురుండదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమూవీ షూటింగ్ సమయంలో అనేకసార్లు బాలయ్య శ్రీకాంత్ కు చనువుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. విలన్ పాత్రలు చేయడమే కాకుండా హీరో కెరియర్ ను కూడ కొనసాగించమని శ్రీకాంత్ కు సలహా ఇస్తూ చెత్త సినిమాలు ఒప్పుకోవద్దని ఇక నుంచి శ్రీకాంత్ నటించే సినిమా పాత్రల విషయంలో తన సలహాలు తీసుకోమని చనువుగా చెపుతూ అభిమానాన్ని చూపించాడట..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: