ఇండస్ట్రీలో రచయిత నుంచి దర్శకుడిగా మారిన వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన ఏ సినిమా చేసినా సరే అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. చాలా తక్కువ టైమ్‌లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా అవతరించారు. బృదావనం, సింహా లాంటి మూవీలకు రచయితగా చేసినా యన ఆ తర్వాత మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్ అయ్యారు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకుంటున్నారు శివ.
తాను అనుకున్నవి అన్నీ కుదిరితేనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. తన కథపై, పాత్రలపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయన రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ కారణాల వల్లనే ఆయనకు అపజయమనేది ఎదురుపడే సాహసం చేయలేదు ఇప్పటి దాకా. ఇప్పటి వరకు ఆయన తీసినది నాలుగు సినిమాలే అయినా.. అవన్నీ ఇండస్ట్రీ హిట్లే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు అన్నీ రికార్డులు తిరగరాసినవే. ఈ సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
కొరటాల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా పైవన్నీ పేరునిలబెట్టాయి. అందువల్లనే ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులో చాలా త్వరగా చేరి మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. ప్రతి సినిమాలో కొరటాల వినోదంతో పాటు మెసేజ్ కూడా ఉండేలా చూస్తారు. అందుకే ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేదిలా కాకుండా సున్నితంగా చాలా క్లియర్‌గా కమర్షియల్ మూవీలను ఆయన తీస్తున్నారు. యాక్షన్ టు ఎమోషన్ వరకు ఆయన మార్కుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొరటాల శివ.
ఇక తన సినిమాల్లో కామెడీకంటూ ప్రత్యేకమైన ట్రాకులు పెట్టకుండా కేవలం కథను నమ్ముకుని సినిమా తీస్తారు కొరటాల. ఇక కామెడీ సీన్స్ అన్నీ చాలా సున్నితంగా ఉండేలా చూసుకుంటారు ఈ డైరెక్టర్. అలాగే సంభాషణలు కూడా సింపుల్ గా ఉండేలా రాసుకుని ఎంటర్ టైన్ చేస్తుంటారు. హీరో హీరోయిన్ల లుక్ విషయంలో అయితే కొరటాల ప్రత్యేక కేర్ తీసుకుని, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య చేస్తున్నారు.