ఇంకా తేలని సుశాంత్ మిస్టరీ...?
అనేక నాటకీయ పరిణామాలతో సుశాంత్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అయితే ఈ కేసులను చివరకు ఆత్మహత్యగా పోలీసులు స్పష్టం చేశారు. కానీ సుశాంత్ అసలు ఆత్మహత్య చేసుకోవడగానికి గల కారణం ఏంటనేది ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. దేశంలోని టాప్ ఆసుపత్రి ఎయిమ్స్ సీబీఐకి సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో మాత్రం సుశాంత్ ఊపిరి ఆడకపోవడం వల్లనే చనిపోయిన్టు తేలింది. సుశాంత్ మృతి సెగ బాలీవుడ్ ను తీవ్రంగా కుదిపేసింది.
సుశాంత్ మృతితో బాలీవుడ్ లో ఉన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నెటిజన్లు. అయితే దీంతో పాటు సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్ కోణం మరో సంచలనానికి దారి తీసింది. అందులో పలువురు స్టార్స్ పేర్లు రావడంతో బాలీవుడ్ లో ప్రకంపనలు రేగాయి. బాలీవుడ్ ధగధగల వెనుక దాగున్న దారుణాలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
ఇక సుశాంత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులోనే అప్పట్లో జైలు గడప తొక్కింది. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ ఆమెను సుశాంత్ అభిమానుల వదలకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. ఈ విధంగా సుశాంత్ ఆత్మహత్య ఇప్పటికీ పెద్ద సంచలనమనే చెప్పాలి.