ఎన్టీఆర్, కొరటాల సినిమాలో విలన్ గా లేడీ యాక్టర్..!

Divya

ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ అయిన రౌద్రం రణం రుధిరం.( ఆర్ ఆర్ ఆర్ ) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్ హీరోయిన్ గా  నటిస్తుండగా, అజయ్ దేవగన్ , సముద్ర ఖని లు  విలన్ పాత్రలో అలరించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది అని చెప్పవచ్చు  ఇక ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా  ఈ చిత్రాన్ని 2021 డిసెంబర్ 14 వ తేదీన విడుదల చేయాలని చిత్ర మేకర్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా , ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం ఒక లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి  కొరటాల శివ  దర్శకత్వం వహించనున్నారు. ఇక నిర్మాతలుగా ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు సుధాకర్ మిక్కిలినేని ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాతలుగా మారారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. 2022 ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రం బృందం తెలిపారు.
ఇక పోతే ఈ చిత్రంలో విలన్ పాత్రలో  ఎవరిని తీసుకుంటారు అని ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా వెల్లడించింది చిత్రబృందం. ఇప్పుడు ఈ చిత్రం లో విలన్ పాత్రలో ఒక లేడీ కనిపించబోతోంది అని సమాచారం. అంతే కాదు బాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటారని టాక్ వినిపించగా, మరోవైపు తమిళ మాజీ హీరోయిన్ పేరు కూడా ఈ విలన్ పాత్రకు సెలెక్ట్ అయినట్లు సమాచారం. మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ కు దీటుగా ఒక లేడీ యాక్టర్ విలన్ గా ఎలా అలరించబోతోందో,ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: