బాలయ్య ఒకే టైటిల్ తో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?

Divya

నందమూరి బాలకృష్ణ బల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. అంతేకాకుండా తన తండ్రి తో పాటు పలు చిత్రాలలో నటించి ,తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు. ఇక ఆ తర్వాత ఫ్యాక్షన్ మూవీలలో నటించి, మాస్ హీరోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాదు సినిమాల నుంచి రాజకీయాల్లో కూడా ప్రవేశించి అక్కడ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అఖండ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా ఈ టైటిల్ రావడం ఎవరైనా గమనించారా..? ఒకవేళ గమనించకపోయి ఉండుంటే.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1). సింహ:
ఈ సినిమా 2010లో బోయపాటి డైరెక్షన్ లో విడుదల కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ ను రఫ్ ఆడించింది. ఈ సినిమా "సింహా" అనే టైటిల్ తో వచ్చింది.

2). లక్ష్మీ నరసింహ:
ఈ సినిమాని తమిళంలో విక్రమ్ నటించగా.. తెలుగులో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా టైటిల్ లో కూడా సింహా అనే ఉంటుంది.

3). నరసింహ నాయుడు:
2001లో బి. గోపాల్ రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ టైటిల్ లో కూడా సింహ అనే పేరును గమనించవచ్చు.

4) సీమ సింహం:
2002లో డైరెక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ,సిమ్రాన్, రీమాసేన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో కూడా సింహా అనే పేరు ఉంది.

5) జై సింహ:
2018లో కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా జై సింహ. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించింది. ఇందులో కూడా సింహా అనే పేరు ఉంది.

6). సమరసింహా రెడ్డి:
బి.గోపాల్ దర్శకత్వంలో 1999 లో బాలకృష్ణ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమా టైటిల్ లో కూడా మనం సింహ అనే పేరును గమనించవచ్చు.

అలాగే బొబ్బిలి సింహం, సింహం నవ్వింది వంటి చిత్రాలలో ఎక్కువగా సింహ అనే పదం వినిపించడం గమనార్హం. ఇక ఇలా సింహా అని  పేరును ఎందుకు వినియోగించారు అంటే , ఈయనను ప్రేక్షకులు ముద్దుగా నట సింహా అని పిలుచుకుంటారు. ఇక అందుకు  తగ్గట్టుగానే అన్ని టైటిల్స్ లో కూడా సింహా అని రావడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: