కంగనా ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ .. కారణమిదే ?

VAMSI
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కంగనా ఈ మధ్య వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. కాగా కంగనా కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్ నుండి కోలుకుని వచ్చిందో లేదో, అప్పుడే మళ్లీ ఇంకో వివాదంలో చిక్కుకుంది. కరోనా నుండి కోలుకున్న తరువాత నిన్న కంగనా మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చిన తన ఆఫీస్ ను చూడడానికి వచ్చింది. అయితే ఈ సందర్భంలో ఆమె మాస్క్ ధరించక పోవడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ విషయం కాస్తా వివాదాస్పదం అయింది.
మాస్క్ లేని కంగనాను చూసిన నెటిజన్లు ఈ విషయాన్ని హైలైట్  చేస్తూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందరికీ చెప్పాల్సిన ఇలాంటి సెలబ్రిటీలు కరోనా నిబంధనలను పాటించకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు.  అంతటితో ఆగకుండా కరోనా నిబంధనలు పాటించని ఈమెను అరెస్ట్ చేయాలని ఒక నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇంకో వ్యక్తి ఆమెకు సన్ గ్లాసెస్ వేసుకోవడం గుర్తుంది కానీ మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. ఈ విధంగా నెటిజన్లు రకరకాలుగా కంగనా ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. కరోనా నుండి కోలుకున్న తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
కొంతమంది అయితే సాధారణ ప్రజలు మాస్క్ వేసుకోకుండా బయటకు వస్తే మాత్రం వారికి జరిమానా విధిస్తున్నారని, అలాంటప్పుడు ఇలాంటి వారికి కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ "తలైవి" లో నటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: