సమంత పై రకుల్ ప్రీతిసింగ్ కామెంట్స్ వైరల్..

Divya

సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లే. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అయితే సమంత సినిమాల్లోనే కాకుండా కొన్ని వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆ వెబ్ సీరీస్  మీద నిన్న మొన్నటి దాక నెటిజన్లు కామెంట్ చేశారు. తమిళనాడులో అయితే ఏకంగా సినిమానే విడుదల చేయకూడదని తమిళ వాసులు కోరుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ సమంత పై ఒక కామెంట్ చేసింది. అదేమిటో తెలుసుకుందాం
.
2019 లో విడుదలైన "ది ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సీరీస్ తో మంచి సక్సెస్ ను అందుకుంది సమంత. దీంతో నే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ పై సినీ ప్రేక్షకులు, సినీ తారలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సమంత వెబ్ సిరీస్ ను చూసి రకుల్ ప్రీతిసింగ్.. స్పెషల్ ట్విట్ తో తన తరపున శుభాకాంక్షలు తెలిపింది. అలాగే మెయిన్ రోల్ చేసిన యాక్టర్ కు కూడా ప్రశంసలు తెలిపింది. రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ.. నేను "ది ఫ్యామిలీ మ్యాన్  2" చూశాను.

ఈ సిరీస్ లో ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉంది. ఇందులో నటించిన మనోజ్ క్యారెక్టర్ పై ఎంత చెప్పినా తక్కువే అంతగా నటించాడు అని తెలిపింది. ఇక ఇందులో సమంత  రాజీ పాత్రలో...టేక్..ఏ..బౌ.. ఇందులో మీ నటన రాజీ క్యారెక్టర్ లో అదరగొట్టేశారు. ఇక దర్శకులు 'రాజ్ అండ్ డీకే'లకు నా తరపున నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు.దీనితో మా ఫ్యామిలీ అంతా మీ అభిమానులు అయ్యారు అని తెలిపింది.

ఈ వెబ్ సిరీస్ లో సమంతను మేకప్ లేకుండా చూడవచ్చు. అంతే కాదు చాలా బోల్డ్ గా నటించింది. అలాగే తన చిన్నతనం నుంచి  హింసలకి గురవడం వల్ల, బాగా విసిగిపోయి  పెద్దయిన అయిన తర్వాత చాలా క్రూరంగా మారిన  రాజీ పాత్రలో సమంత నటించింది. ఇందులో సమంతా ఊహించని విన్యాసాలు కూడా చేసింది." అని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: