సంక్రాంతి రేసులో మహేష్ సినిమా లేనట్టేనా..?

N.ANJI
గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన తెరకెక్కేడుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను ‘మైత్రీ మూవీ మేకర్స్, ‘జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు త‌మ‌న్ ఎస్.ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తి చేసుకుంది. అయితే రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ఉగాది రోజున సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ వాయిదా వేశారు చిత్ర యూనిట్.
ఇక ఇది ఉండగా.. 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ కాబోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్ద సినిమాల షూటింగులు జూలై నుండీ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక హేష్ బాబు మాత్రం ఆగష్టులో ‘సర్కారు వారి పాట’ ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఉంటుంది కాబట్టి.. 2022 జనవరికి ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దసరాకి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ ‘పుష్ప’ వంటి సినిమాలు విడుదలవుతాయని అంటున్నారు.
అయితే వాటి  దృష్టి ఇప్పుడు 2022 సంక్రాంతి పై పడిందని తెలిపారు. ఇక జనవరి నెలలో అటు ఇటుగా ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే  ఈ ఏడాది మొత్తం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయని చిత్ర వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు.. ఈ ఏడాది పెద్ద సినిమాలను విడుదల చేస్తే భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక ‘సర్కారు వారి పాట’ 2022 సమ్మర్ కు గాని విడుదలయ్యే అవకాశాలు లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: