కారా మజాకా.. ఫేమ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Divya

ఒకప్పుడు బుల్లితెర పై ప్రసారమైన  షోలో ఆట డ్యాన్స్ షో ప్రోగ్రాం ద్వారా చాలామంది డాన్సర్లు అయినవారు ఉన్నారు. అంతేకాకుండా అప్పట్లోనే ఈ ఆట డాన్స్ షో కి   టీ ఆర్ పీ రేటింగ్ కూడా బాగానే ఉండేది. ఈ షో ద్వారా చాలామంది డాన్సులతో అదరగొట్టి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అలాంటి వారిలో గీతిక కూడా ఒకరు. అయితే ఈ పాప ఇప్పుడు ఏం చేస్తోంది.. ఎక్కడుంది. అనే విషయం తెలుసుకుందాం.
గీతిక అతి చిన్న వయసులోనే తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. జీ తెలుగులో ప్రసారం అయిన ఆట 5 జూనియర్ ప్రోగ్రామ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యి, ఆ సీజన్లో ఈ అమ్మాయి విజేతగా కూడా నిలిచింది. ఇక ఈ షో ద్వారా మంచి ఫామ్లో ఉన్న ఈ పాప చిన్న వయసులోనే సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గీతిక కారా మజాకా వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి సంగీత అలీ రాజీవ్ కనకాల ఓ ప్రధాన పాత్రలో నటించారు.

ఇక ఆ తర్వాత పలు సీరియల్స్ లోనూ, సినిమాలలో నటించి అందరినీ ఆకట్టుకుంది. తెలుగు,తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించింది. అలా మళ్లీ తిరిగి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కనిపించింది. ఈ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అంతేకాకుండా 2012లో ఒక ప్రోగ్రాం కి వెళ్లి వస్తుండగా, ప్రమాదానికి గురైంది. అప్పుడు తన ఎడమ కాలు, చెయ్యి విరిగి తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపింది. ఇక ఆ తర్వాత నటించినా తనకి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇదిలా ఉంటే తన గురించి రకరకాల వీడియోలు వచ్చాయని, అవన్నీ  పుకార్లే  అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నానని చెప్పింది. ఇక తను ఇప్పటికి కూడా డాన్స్ మరువలేదు, డ్యాన్స్ అంటే తన రక్తంలోనే ఉంది అంటూ తెలిపింది. ఇక ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: