కరోనా టైం ని కరెక్ట్ గా వాడుతున్న చిరు ..... ??
భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో పలు కమర్షియల్ అంశాలు కలగలిపి అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు కొరటాల ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కేవలం పది రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా ఆయన అనుచరుడిగా రాంచరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్న విషయం తెలిసిందే.
ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా కరోనా సెకండ్ వేవ్ మనదేశంలో ఉదృతంగా కొనసాగుతుండడంతో సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోవడంతో మిగతా నటులతో పాటు మెగాస్టార్ కూడా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దొరికిన టైం ని ఏ మాత్రం వేస్ట్ చేయడం ఇష్టం లేని మెగాస్టార్, ప్రస్తుతం లూసిఫర్ లోని తన క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుండటంతో పాటు డైట్ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అలానే ఆ సినిమా కోసం మెగాస్టార్ త్వరలో గడ్డం కూడా పెంచబోతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ కరోనా టైం ని కరెక్ట్ గా వాడుతున్న చిరు ఆచార్య, లూసిఫర్ సినిమాల ద్వారా ఏ స్థాయి విజయాలని అందుకుంటారో చూడాలి..... !!