సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !
అలాంటి సమంత పై ఇప్పుడు ఊహించని విధంగా తమిళ సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారడం సంచలనంగా మారింది. ‘షేమ్ ఆన్ యు సమంత’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ నిన్న అంతా ట్రెండింగ్ గా మారింది. ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న ‘ద ఫ్యామలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందుకు సమంత పై ఆగ్రహంతో తమిళనాడులోని చాలామంది రగిలి పోతున్నారు.
వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన రాజ్ డీకే లు ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ పూర్తిగా వెబ్ సిరీస్ చూసి కామెంట్స్ చేయమని అనేకసార్లు చెపుతున్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకునే స్థితిలో తమిళ ప్రజలు లేకపోవడమే కాకుండా ఈ విషయమై సమంత వెంటనే స్పందించాలి అంటూ ఒక ఉద్యమం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సమంత మౌనంలోనే ఉంది. దీనితో ఈరోజు నుంచి స్ట్రీమ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చూడమని చెపుతూ చివరి అస్త్రంగా సమంత పై ప్రచారంలోకి తీసుకు వచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ ఒక విధంగా సమంత కు అనుకోని ఉప్పెన..