అదంతా అపోహ.. మేము కూడా అలా చేస్తున్నాం : తమన్నా

praveen
ప్రస్తుతం దేశాన్ని మొత్తం కరోనా వైరస్ కమ్మేస్తుంది. సంపన్నుల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అటు పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దుర్భరంగా మారిపోతుంది..  పని చేసుకుందామంటే ఉపాధి లేక.. చివరికి తినడానికి తిండి లేక.. పేద మధ్యతరగతి ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఓవైపు కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే మరోవైపు ఆకలితో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఎంతో మంది  ప్రముఖులు ముందుకు వచ్చి తమ పెద్దమనసు చాటుకుంటున్నారు.

 కేవలం సంపన్నులు మాత్రమే కాదు సామాన్యులు సైతం తమకు ఉన్న దాంట్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఇలాంటి సమయంలో అటు సినీ సెలబ్రిటీలు మాత్రం కరోనా క్లిష్ట సమయంలో ఏమి చేయడం లేదు అన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది.  ప్రేక్షకులు సినిమాలు చూస్తేనే హీరోలు, హీరోయిన్లు గా మారిన వారు ఇక ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యి.. కనీసం జనాలను పట్టించుకోవడం లేదు అంటూ ఎంతో మంది సినీ సెలబ్రిటీల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి తరుణంలో తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరోయిన్ తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 కరోనా వైరస్ పరిస్థితుల్లో సినీ తారలు ఆశించిన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదు అని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అర్ధరహితం అంటూ చెప్పుకొచ్చింది. సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు చేయడం లేదని ప్రచారాన్ని విరివిగా సృష్టించారని కానీ సినిమా వాళ్లు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ తమన్నా తెలిపింది. కానీ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రచారానికి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. తాను కూడా చారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను అంటూ తెలిపింది.  కానీ ఇలాంటి తప్పుడు వార్తలు వల్ల తమపై రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతోంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: