ఈ చిత్రాలు ఎన్ని రోజులు షూటింగ్ జరుపుకున్నాయో తెలిస్తే షాకే..!

Suma Kallamadi
గతంలో దర్శకులు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయడానికి చాలా సంవత్సరాల సమయం తీసుకునేవారు. ఇప్పటి రోజుల్లో ఒక్క రోజులోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు తప్పించి మిగతావన్నీ కూడా కేవలం ఆరు నెలల సమయంలోనే చిత్రీకరణకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాయి. ఐతే చలనచిత్ర పరిశ్రమ తొలినాళ్ళలో కొన్ని సినిమాలు పూర్తి చేయడానికి ఏడేళ్ళు పట్టింది అంటే నమ్ముతారా..? పాత కాలంలో చిత్తూరు వి. నాగయ్య నటించిన భక్త రామదాసు సినిమా చిత్రీకరణ 1957లో ప్రారంభం అయ్యింది కానీ ఆర్ధిక సమస్యలు, నటీనటుల గొడవలతో సినిమా పూర్తి చేయడానికి 7 ఏళ్ళ కాలం పట్టింది. 1957లో ప్రారంభమైన ఈ సినిమా 1964వ సంవత్సరంలో విడుదల అయ్యింది. దీంతో భక్తరామదాసు చిత్రం అత్యధిక కాలం పాటు షూట్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది.


నందమూరి తారక రామారావు హీరోగా నటించిన లవకుశ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ఐదేళ్ళ కాలం పట్టిందట. ఈ చిత్రం యొక్క షూటింగ్ 1958లో ప్రారంభమై.. 1963లో పూర్తయింది. అప్పట్లోనే 5లక్షల బడ్జెట్ తో ప్రారంభమైన లవకుశ సినిమా.. కలర్ తదితర కారణాల వల్ల 50 లక్షల బడ్జెట్ కు చేరుకుంది. అమ్మోరు సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి గ్రాఫిక్స్ తదితర అంశాల కారణంగా మూడు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా 1992లో ప్రారంభమై.. 1995లో షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం యొక్క షూటింగ్ 2013లో స్టార్ చేస్తే సినిమా 2015 లో విడుదలైంది. బాహుబలి పార్ట్ 2 సినిమా షూటింగు పూర్తవడానికి కూడా రెండు సంవత్సరాల సమయం పట్టింది. కథకు సంబందించిన అంశాలు, గ్రాఫిక్స్ వంటి తదితర అంశాల కారణంగా బాహుబలి రెండు భాగాలు  పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పట్టింది.



ఇకపోతే అనుష్క హీరోయిన్ గా నటించిన అరుంధతి సినిమా 2006 లో ప్రారంభమై 2009లో విడుదలయింది. సినిమా నిర్మాణ విషయాల్లో ఇబ్బందులు ఎదురు కావడం వలన అరుంధతి సినిమాకి మూడేళ్ల సమయం పట్టింది. విజయశాంతి, బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన నిప్పురవ్వ షూటింగ్ లో ప్రమాదాలు జరగడం, బడ్జెట్ లో మార్పులు వంటి సమస్యల వల్ల రెండేళ్ల కాలం పట్టింది. బాలకృష్ణ హీరోగా నటించిన గాండీవం సినిమా కూడా ఆర్థిక సమస్యల కారణంగా రెండు సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య మూవీ రెండున్నరేళ్లు షూటింగ్ జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: