పెళ్లయినా.. ఆ "పని" ఆపని విద్యాబాలన్..?

Suma Kallamadi
డిసెంబర్ 14, 2012 లో సిద్ధార్థ్ రాయ్ ని వివాహమాడిన విద్యాబాలన్ సినిమాలు చేయడం మాత్రం మానేయ లేదు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి చెప్పి వైవాహిక జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తుంటారు. కానీ విద్యాబాలన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 'ది డర్టీ పిక్చర్ ', ' పా ', ' కహానీ ', ' తుమ్హారీ సులు ', ' భూల్ భూలైయా ' వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటన చాతుర్యాన్ని కనబరిచి గొప్ప నటీమణిగా విద్యాబాలన్ పేరొందారు. ఆమె జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. 2014లో ఆమె పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత కూడా.. సినిమాల్లో కొనసాగవచ్చని సిద్ధార్థ్ రాయ్ విద్యాబాలన్ కి ఫ్రీడమ్ ఇచ్చారు. నాతో జీవితాన్ని ప్రారంభించినంత మాత్రాన ఆమె కాళ్లకు సంకెళ్ళు లేమీ పుట్టుకురావు. పెళ్లి కాక ముందు తాను తన జీవితాన్ని ఎలా గడిపారో పెళ్లయిన తర్వాత కూడా ఆమె స్వేచ్ఛగా తన జీవితాన్ని గడపవచ్చు అని సిద్ధార్థ్ తన విశాలమైన హృదయంతో విద్యాబాలన్ కి చెప్పారట.
దీంతో ఆమె సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఆమె తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు చిత్రాల్లో ఆమె బసవతారకం గా నటించారు. తమిళంలో పింక్ సినిమాకి రీమేక్ గా వచ్చిన నేర్కొండపార్వై చిత్రంలో ఆమె అతిథి పాత్రలో నటించారు. నాట్కట్ చిత్రంలో ఆమె సోనూ సూద్ కి తల్లిగా నటించారు. ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త అయిన శకుంతలా దేవి యొక్క బయోపిక్ అయిన "శకుంతలాదేవి" సినిమాలో ఆమె టైటిల్ రోల్ లో నటించారు. మానవ గణన యంత్రము గా పేరొందిన శకుంతలా దేవి నిజజీవిత పాత్రను వెండితెరపై అవలీలగా పోషించి సర్వత్ర ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ని సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి అయ్యి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా.. విద్యాబాలన్ సినిమా రంగంలో కొనసాగుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: