చిరంజీవి ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఏమనేవారో తెలుసా ..... ??

GVK Writings
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమని తొలితరం సూపర్ స్టార్ గా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఏలిన విషయం తెల్సిందే. ఇక తన కెరీర్ లో మొత్తంగా 302 సినిమాలు చేసిన నందమూరి తారకరామారావు జానపదం, పౌరాణికం, సాంఘికం, యాక్షన్ ఇలా అన్ని రకాల జానర్లలో కూడా సినిమాలు చేసి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానులు మనస్సులో గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక అప్పట్లో అన్న గారి సినిమా విడుదలవుతోంది అంటే వేరే ఊళ్ళ నుండి బళ్ళు కట్టుకుని మరీ వచ్చి ప్రేక్షకులు సినిమా చూసేవారు అంటే అన్న గారి క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సినిమారంగంతో పాటు అటు రాజకీయాల్లో కూడా నాయకుడిగా ప్రజల మనసు గెలుచుకున్న ఎన్టీఆర్ 25 ఏళ్ళ క్రితం మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ ఆయన చేసిన సినిమాల్లోని పాత్రలు, చేసిన సేవలు మనం ఎప్పటికీ మరచిపోలేము. ఇక నటుడిగా తాను అగ్రపథాన దూసుకెళ్తున్నప్పటికీ తన తోటి నటీనటులను సైతం ఎంతో ప్రోత్సహించేవారు ఎన్టీఆర్. తమ తరం తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లను కూడా వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎన్టీఆర్ ఆ తరువాత వచ్చిన తరంలోని నెంబర్ వన్ హీరో చిరంజీవి ని కూడా ఎంతో అభినందించి ప్రోత్సహించేవారట.
నటుడిగా తాను ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో తన నటనని మెచ్చిన ఎన్టీఆర్, తప్పుకుండా నువ్వు రాబోయే రోజుల్లో మంచి స్థాయికి ఎదుగుతావు బ్రదర్ అని తరచు అంటుండేవారని, అలానే తన తొలి కమర్షియల్ సక్సెస్ ఖైదీ తరువాత నటుడిగా తనకు మరిన్ని ఛాన్స్ లు దక్కడం ఆపై తాను తిరుగులేని హీరోగా దూసుకెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా తనను పిలిచి గౌరవించేవారని, అలానే ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తనకు సినిమాల పట్ల మనం ఎలా అంకిత భావంతో పని చేయాలి, ఏ విధంగా సమయపాలన చేయాలి, తోటి నటీనటులను ఎలా గౌరవించాలి వంటి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను అని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ని గురించి చిరంజీవి చెప్తుంటారు. ఆ విధంగా చిరంజీవి పై నందమూరి తారక రామారావు తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: