ఎన్టీఆర్ 8 మంది కొడుకులు 4 గురు కూతుళ్లు ఎక్కుడున్నారు..? ఏం చేస్తున్నారు.. ?

MADDIBOINA AJAY KUMAR
అన్నగారు ఎన్టీరామారావుకు పంన్నెండుమంది సంతానం ఉన్నారు. పన్నెండు మందిలో 8 మంది కొడుకులు కాగా 4 గురు కూతుళ్లు ఉన్నారు. అయితే వారిలో బాలకృష్ణ, హరికృష్ణ తప్ప మిగతావారు ఎవరూ పెద్దగా పరిచయం లేదు. అయితే వారిలో అతిత‌క్కువ మంది మాత్ర‌మే సుప‌రిచితులు అయితే మిగ‌తా వాళ్లు ఎవ‌రు.... ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అనే వివరాలు చూద్దాం...ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ. ఈయన చిన్నప్పుడే చనిపోయారు. ఇక రెండవ కుమారుడిపేరు జయకృష్ణ. ఈయ‌న బిజినెస్ చేస్తున్నారు. మూడవ సంతానం దగ్గుబాటి పునందేశ్వరి. పురందేశ్వ‌రి ఏపీ రాజాకీయాల్లో చురుకుగా ఉంటారు. నాలుగవ సంతానం నందమూరి సాయి కృష్ణ.  ఈయన కూడా చనిపోయారు. ఇక అన్నగారి ఐదవ సంతానం నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ. సినిమాల్లో మరియు రాజకీయాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు. హరికృష్ణ 2018లో కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆరవ సంతానం నందమూరి మోహన కృష్ణ. హరికృష్ణ, మోహన కృష్ణ చాలా క్లోజ్ గా ఉండేవారు. 

చిన్నప్పటి నుండి వీరు అన్నతమ్ముళ్ళలా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండేవారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరో తారకరత్న ఈయన కుమారుడే. అయితే తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తారకరత్నతో మోహన కృష్ణ కు మాటలు లేవు. ఇక ఏడవ సంతానం మన నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కుమారుల్లో పరిచయం అక్కర్లేని పేరు బాలయ్య. ఎన్నో సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ కుమారుడని బాలయ్య అనిపించుకున్నారు. ఇక ఎనిమిదవ సంతానం నందమూరి రామకృష్ణ జూనియర్. మొదటి కొడుకు చనిపోవడం వల్ల ఆయనపై ఉన్న ప్రేమతో ఎన్టీఆర్ ఆ పేరు పెట్టుకున్నారు. ఈయన ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేశారు. ఆ తరవాత పుట్టిన 9వ సంతానం నందమూరి జయశంకర కృష్ణ. ఇక ఆ తరవాత పడవ సంతానంగా నందమూరి భువనేశ్వరి పుట్టారు. ఈవిడ చంద్రబాబు భార్య అని అందరికీ తెలిసిందే. పదకొండవ సంతానం గరికపాటి లోకేశ్వరి. ఈవిడ కూడా భయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇక చివరి సంతానం కాటమనేని ఉమా మహేశ్వరి. ఈవిడ గురించి కూడా భయట ప్రపంచానికి పెద్దగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: