ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

N.ANJI
సినిమా కంటే ముందుగా పాటలను రిలీజ్ చేసి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇక పాటలు ప్రేక్షుకులను థియేటర్ దాక నడిపిస్తున్నాయి. ఇక ఉప్పెన సినిమాలో నీలి కళ్లు నీలి సముద్రం…’ పాట. సినిమా రిలీజ్‌కు సంవత్సరం ముందే ఈ పాట విడుదల చేశారు. సినిమా విడుదలయ్యేవరకు ఈ పాట వినిపిస్తూనే ఉంది. సినిమా వచ్చి హిట్‌ అయిన తర్వాత… ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మరి అలాంటి హిట్‌ పాట గురించి ఆ గీత రచయిత శ్రీమణి ఏమన్నారో తెలుసా?
ఇక హీరో తన మనసులో దాచిన ప్రేమను చూపించే పాట కోసం చర్చలు మొదలయ్యాయట. దానికి గోదావరి జిల్లాల్లో ప్రాముఖ్యం ఉన్న ముస్లిం బషీర్‌బేబీ తిరునాళ్ల నేపథ్యం అనుకున్నారు. దాంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఖవాలి’ శైలిలో సంగీతం ఇచ్చారట. దీంతో ఓ హిందీ పల్లవి రాయించి, పాడించారట. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌ ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అంటూ పల్లవి చెప్పారు. ఇక ఆ పాటను పూర్తి చేసే పని శ్రీమణికి ఇచ్చారట. కథకు తగ్గట్టూ హీరో దాచుకున్న ప్రేమను చెప్పాలి. అయితే అందరికీ అర్థమయ్యే సులభమైన పదాలు ఉండాలి. అలా ఈ పాట రాయడం శ్రీమణి మొదలుపెట్టారట.
కాగా.. తొలి ప్రేమ అనగానే శ్రీమణికి వరుసగా చరణాలు వచ్చేశాయట. అలా అవి ఎనిమిది వరకు సిద్ధమయ్యాయట. అందులోంచి సంగీత దర్శకుడు నచ్చినవి ఎంచుకున్నారట. అలా చరణాలు పూర్తయ్యాక పల్లవి మీదకు వచ్చార శ్రీమణి. ‘నీ కన్ను నీలి సముద్రం…’ ఇచ్చిన దేవిశ్రీ ఇచ్చిన పదాలకు ‘నీ నవ్వు ముత్యాలహారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం’ అని కలిపారట. అలా పాట సిద్ధమైందట. పాట విన్నవెంటనే దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌కి బాగా నచ్చిందట. ఆ తర్వాత అందరూ లూప్‌లో వినే పాట అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: