చిరంజీవిపై శ్రీరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు..?
అంతేకాకుండా ఆనందయ్య కు మద్దతుగా పోస్టులు పెడుతూ.. ఆనందయ్య పై నెగిటివ్ గా వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఏకి పారేస్తోంది. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ లు తయారు చేస్తూ యూట్యూబ్ వేదికగా వీడియోలు అప్ లోడ్ చేస్తోంది. అయితే ఆమె తాజాగా చిరంజీవి, కరాటే కల్యాణి లపై పెట్టిన ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కి "మా" మెంబర్ షిప్ కోసం చిరంజీవి లక్ష రూపాయలు దానం చేసిన విషయం తెలిసిందే. నటీమణి కరాటే కళ్యాణి పావలా శ్యామల ఇంటికి వెళ్లి మరీ తాను సేకరించిన విరాళాలు అందించిన సంగతి కూడా తెలిసిందే. కాగా, కష్టకాలంలో ఆదుకున్న వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పావలా శ్యామల.. బదులుగా విమర్శలు చేస్తూ అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పావలా శ్యామల వ్యవహారంలో శ్రీ రెడ్డి జోక్యం చేసుకున్నారు. పావలా శ్యామల కి సహాయం చేసిన చిరంజీవి, కరాటే కళ్యాణి లను ఆమె టార్గెట్ చేస్తూ పచ్చి బూతులు మాట్లాడారు. బాబీ, కరాటే కుక్క, చిరంజీవి తాత అంటూ ఆమె ఫేసుబుక్ లో పెట్టిన ఓ పోస్టు అభిమానుల్లో ఆగ్రహజ్వాలలు రేకెత్తిస్తోంది.
"చిరంజీవి తాత సరదాగా కరాటే కుక్కని వీధిలోకి వాకింగ్ కి తీసుకొచ్చాడేంటో..బాగా చిరంజీవి బాబీ ని.. ఛీ ఛీ" అంటూ శ్రీ రెడ్డి అసభ్యకరమైన పదజాలం వాడేసింది.